
తమిళ స్టార్ హీరో తన సినిమాలతో పాటు, ఇతర సినిమాల్ని ఎక్కువగా థియేటర్లలోనే చూస్తాడు. మరి అంత పెద్ద హీరోకు అది సాధ్యమా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ థియేటర్లకు వెళ్తాడు. తన ముఖం ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తపడతాడు.
తనకు ఆ బాధ లేదంటున్నాడు హీరో సుమంత్. తను సింపుల్ గా ఓ హూడీ వేసుకొని థియేటర్ కు వెళ్లిపోతానని, ఒక్కడ్నే వెళ్లి ఒక్కడ్నే తిరిగొస్తానని కూడా అన్నాడు. అలా అప్పుడప్పుడు కాదంట, వారానికి కనీసం 2-3 సార్లు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తాడంట సుమంత్.
సినిమా ఏదైనా తనకు సిల్వర్ స్క్రీన్ పై చూడడం ఇష్టమని అంటున్నాడు. వీకెండ్స్ జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి, సోమ, మంగళ, బుధ వారాల్లో మార్నింగ్ షోలకు ఈ హీరో వెళ్తుంటాడట. అంతేకాదు, తను రెగ్యులర్ గా వెళ్లే థియేటర్ల పేర్లు కూడా చెప్పాడు. హైదరాబాద్ ఏఎంబీ, ఆర్కే సినీమ్యాక్స్ లో ఎక్కువగా సినిమాలు చూస్తానంటున్నాడు.
ఇక పెళ్లిపై స్పందిస్తూ, రీసెంట్ గా తన పెళ్లిపై చాలా పుకార్లు వచ్చాయని, అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు సుమంత్. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ప్రకటించాడు. ఒంటరిగానే ఉంటాను అని చెప్పాడు.
ALSO READ: Sumanth responds to his wedding rumors
గతంలో మృణాల్ ఠాకూర్ తో ఉన్న ఫోటోని వైరల్ చేసి ఈ 50 ఏళ్ల హీరో 32 ఏళ్ల మృణాల్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని పుకార్లు పుట్టించారు. కానీ జీవితంలో ఒంటరిగా ఉంటాను, సినిమాలు ఒంటరిగానే చూస్తాను అని క్లారిటీ ఇచ్చాడు.