
సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఈ తరంలో అత్యంత పాపులర్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిశోర్ తాజాగా “సింగిల్” సినిమాతో ప్రశంసలు అందుకుంటున్నారు. వెన్నెల కిషోర్ తన కెరీర్ గురించి చెప్తున్న విశేషాలు….
కొత్తదనం కనిపించేలా మీరు పాత్రలను ఎంచుకుంటున్నారా?
ఎంచుకునే అంత పరిస్థితి లేదు. అంత వైవిధ్యం లేదు ఇప్పుడు. రైటర్స్ ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి మంచి ఆలోచనలతో, మంచి పాత్రలతో వస్తారు. రైటర్లపై సినిమా పరిశ్రమ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎక్కువసార్లు రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. దాన్ని నా శైలికి మలుచుకొని, లేదా దాన్ని నేను ఓన్ చేసుకొని అందులోనే ఏదో ఒక కొత్తదనం కనిపించేలా చేసేలా ప్రయత్నం చేస్తుంటాను.
ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు?
నాకు అంతగా పరిచయం లేని ఒక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి అలరించే పాత్రలు చేయడం నాకు ఇష్టం. అలా చెప్పుకుంటే… “గీతగోవిందం” “అమీతుమీ చిత్రాల్లో చేసిన పాత్రలు నాకు బాగా ఇష్టం.
ఇప్పుడున్న కాలంలో కామెడీ పండించడం కష్టమేనా?
వెరీ చాలెంజ్ ఇప్పుడు కంటెంట్ విపరీతంగా అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ ఉంది. రీల్స్ ఓపెన్ చేస్తేనే బోలెడు కామెడీ వీడియోలు కనిపిస్తాయి. థియేటర్స్ కి వచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే అంతకుమించి ఇవ్వగలగాలి. అలాంటి క్యారెక్టర్ కుదరాలి. అవన్నీ కుదరడం వెరీ బిగ్ చాలెంజ్.
మీకు ఏ జోనర్ ఇష్టం?
నాకు థ్రిల్లర్స్ ఇష్టం.
చార్లీ సినిమా తర్వాత మళ్లీ హీరోగా సినిమా చేయలేదు. ఇక హీరోగా సినిమాలు మానేసినట్లేనా?
ఆఫర్లు వస్తున్నాయి. కానీ అందులో లవ్ స్టోరీ, పాటలు అంటున్నారు. అవి నాకు అంతగా సూట్ కావు. పూర్తిగా కామెడీ కథ కుదిరితే తప్పకుండా చేస్తాను.
బ్రహ్మానందం గారు మీరు తన వారసుడని చెప్పడం ఎలా అనిపించింది?
అది ఆయన ప్రేమతో అన్నమాట. ఏదో నాకు కొంత బూస్టప్ ఇవ్వడానికి ఆ మాట అభిమానంతో చెప్పినదే.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. ‘దూకుడు’ సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది. మహేష్ బాబు గారి పక్కన అంతా మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్ రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
మీ ఫేవరెట్ క్యారెక్టర్స్?
చాలా ఉన్నాయి. అయితే జీవితాంతం గుర్తుండిపోయేవి వెన్నెల, బిందాస్, దూకుడు.