
ముందు ఒకరు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత దాన్నే వేరే ఎవరైనా చేస్తే కచ్చితంగా కాపీ అంటారు. అలా తనకు తెలియకుండా కాపీ క్యాట్ అయిపోయింది కియరా. మెట్ గాలా ఈవెంట్ లో ఆమె ఐశ్వర్య రాయ్ ను అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టిందనేది సోషల్ మీడియా టాక్.
ఇంతకీ ఏం జరిగిందంటే.. న్యూయార్క్ లోని ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్’లో జరిగిన మెట్ గాలా ఫంక్షన్ లో పాల్గొంది కియరా. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన నలుపు-తెలుపు-బంగారు రంగు దుస్తుల్లో తన అందమైన బేబీ బంప్ ను ఆమె ప్రదర్శించింది.
ఈ స్టిల్స్ చూసిన వెంటనే కాన్స్ చిత్రోత్సవంలో ఐశ్వర్య రాయ్ గుర్తొచ్చింది చాలామందికి. కొన్నేళ్ల కిందట కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు దాదాపు ఇదే తరహా దుస్తుల్లో వెళ్లింది ఐష్. దీంతో ఐష్ ను కియరా కాపీ కొట్టిందంటూ కామెంట్స్ పడుతున్నాయి.
ALSO READ: Kiara Advani shows off her baby bump at Met Gala 2025
నిజానికి రంగులు దాదాపు ఒకటే అయినప్పటికీ, డిజైనింగ్ లో, డీటెయిలింగ్ లో చాలా తేడా ఉంది.
సామాన్య ప్రేక్షకులు అంత డీటెయిలింగ్ లోకి వెళ్లరు కదా. అక్కడే వచ్చింది చిక్కంతా. కాబోయే తల్లిగా మెట్ గాలలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందంటూ కియరా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.