Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

‘ఆ.ఓ.అ’ క్లీన్ ఎంటర్ టైనర్: అల్లరి నరేష్

Cinema Desk, May 1, 2024May 1, 2024
Allari Naresh

ఈ సినిమాకి నాన్నగారి క్లాసిక్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది?

ఖచ్చితంగా బరువుగా వుంటుంది. ఆ సినిమాకి, దీనికి పోలిక పెడతారేమో అని కాస్త ఒత్తిడిగా అనిపించింది. అయితే ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. రకరకాల పేర్లు అనుకున్నప్పుడు.. ఒక సందర్భంలో సడన్ గా ‘ఆ ఒక్కటీ అడక్కు’అని వచ్చింది. నిజానికి ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్. ఇందులో హీరోకి ఏజ్ బార్ అయినప్పటికీ పెళ్లి కాదు. అందరూ తనని పెళ్లి ఎప్పుడు, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావ్ అంటే చిరాకుతో చెప్పే డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.

అయితే టైటిల్ తప్పా ఆ సినిమాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా వుంటుంది. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ తనకి పెళ్లి కాదు. అది ఇంకా ఫస్ట్రేషన్ (నవ్వుతూ)

మళ్ళీ కామెడీ సబ్జెక్ట్ చేయడానికి కారణం?

అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే వున్నాను. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా దేనికవే భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించాను. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ వుంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి గారు ఈ కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లి ని ఇప్పటివరకూ ఫన్ తో చూపించారు. ఐతే ఇందులో దాని వెనుక ఒక సమస్య, స్కామ్, పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైనర్ గా వుంటుంది. చివరి రెండు రీళ్లలో ఎమోషనల్ టచ్ వుంటుంది.

కొత్త దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?

దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు అందులోని పాయింట్ కి చాలా కనెక్ట్ అయ్యాను. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. కథలో సహజత్వం వుట్టిపడుతుంది. కామెడీ లోనే చక్కని సందేశం వుంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోజింపచేసేలా వుంటుంది. మల్లి ఈ కథని చాలా బలంగా రాసుకున్నారు. దీనికి రచయితగా అబ్బూరి రవిగారు తోడయ్యారు. కామెడీ, ఎమోషన్ అద్భుతంగా రాశారు.

కామెడీ, మెసేజ్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు?

సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ చివర్లో ఎదో మంచి సందేశం వుండాలి. కితకితలు కామెడీ సినిమానే. కానీ అందులో చూపించిన ‘ఇన్నర్ బ్యూటీ’ సందేశం ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయ్యింది. నాన్నగారి సినిమాల్లో కూడా అంతర్లీనంగా మంచి సందేశం వుంటుంది. ఈ సినిమాలో చూపించే సందేశం కూడా ప్రేక్షకులని కదిలించేలా వుంటుంది.

హీరోయిన్ గురించి?

మల్లి గారు ఈ కథ అనుకున్నప్పుడే హీరోయిన్ ఫరియా అయితే జోడి బావుంటుందని అనుకున్నారు. ఫారియాకి కథ చెప్పడం, కథ నచ్చి చేయడం జరిగింది. తను సెట్స్ కి వచ్చిన తర్వాత అందరూ మా ఇద్దరి హైట్ గురించి మాట్లాడుకున్నారు. తొలిసారి యాపిల్ బాక్స్ ఎత్తు లేకుండా చేసిన సినిమా ఇది( నవ్వుతూ). తను అద్భుతమైన నటి. మంచి డ్యాన్సర్. చిన్న చిన్న కౌంటర్లు కామికల్ గా ఇచ్చిన తీరు నన్ను సర్ ప్రైజ్ చేసింది. తనకి మంచి కామెడీ సెన్స్ వుంది. మా జోడి కూడా చాలా బావుటుంది.

చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది?

కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. ఈ మధ్య కొంచెం ఫైట్లు చేసి బెండు తీరిపోయింది ( నవ్వుతూ). మళ్ళీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. మళ్ళీ కామెడీ సినిమా చేయడం హోమ్ గ్రౌండ్ లో ఆడినట్లుగా వుంది(నవ్వుతూ). కామెడీకి ఇదివరకటికంటే ఆదరణ పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి హ్యుమర్ వున్న సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. కంటెంట్, హ్యుమర్ బావుంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు.

గతంలో మీ నుంచి ఏడాదికి కనీసం మూడు సినిమాలు ఉండేవి?

ఈసారి వస్తాయి అండీ. ఇప్పటికే నా సామిరంగ వచ్చింది. మే3న ఈ సినిమా వస్తుంది. బచ్చల మల్లి జులై లేదా ఆగస్ట్ లో రావచ్చు. డిసెంబర్ లో మరో సినిమా వచ్చే అవకాశం వుంది.

డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు?

ప్రస్తుతం నా ద్రుష్టి నటనపైనే వుంది. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుదిగాడు 2 కోసం అడుగుతున్నారు. ఓ ఐడియా వచ్చింది. అది రాస్తున్నా.

ఈవీవీ బ్యానర్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారా?

కథలు వింటున్నా అండీ. ఆ బ్యానర్ లో చేయదగ్గ కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను. ‘ఎవడిగోల వాడిది’ లాంటి సినిమా చేయాలని నా కోరిక.

ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని వుంది?

అన్నీ రకాలు సినిమాలు చేయాలి. డార్క్ హ్యుమర్ వున్న కథలు చేయడానికి కూడా ఇష్టపడతాను. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై ద్రుష్టిపెడుతున్నాను. అలాగే ‘పుష్పక విమానం’ లాంటి మూకీ సినిమా చేయాలని వుంది.అలాగే ‘జోకర్’ లాంటి క్యారెక్టర్ చేయాలని వుంది. మనం నవ్వుతుంటే ఆడియన్స్ భయపడాలి.

ఏ హీరోలతో కలిసి పని చేయాలని వుంది?

వెంకటేష్ గారితో కలసి చేయాలని వుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన నేను కలసి ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేస్తే బావుటుందని భావిస్తున్నాను. అలాగే అందరి హీరోలతో చేయాలని వుంటుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారితో ఒక్క సీన్ అయిన షేర్ చేసుకోవాలని వుంటుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు?

బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. త్వరలోనే చెబుతాను

ఇంటర్వ్యూలు

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Tamannah
    రూ.6 కోట్లు చేజారిపోతాయా?
  • Bhairavam
    కనకమేడల అసందర్భ ప్రకటన
  • Hari Hara Veera Mallu
    పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!
  • AA22
    బన్నీకి ఈ భామలు ఫిక్స్!
  • Bollywood heroines
    వీళ్లకు అంత సీనుందా?
  • Simran
    సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ
  • Pawan Kalyan in Hari Hara Veera Mallu
    స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్
  • Trisha
    షుగర్ బేబీ త్రిష అందాలు
  • Sukumar and Ram Charan
    చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!
  • Raghu Babu
    రఘుబాబు పాట ప్రయాస!
  • RGV
    కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్
  • Aarti Ravi
    ఆర్తికి నెలకు 40 లక్షలు కావాలంట
  • Kiara Advani
    అటెన్షన్ అంతా కియరాదే
  • Vishal and Sai Dhansika
    విశాల్ కాబోయే భార్య: ఎవరీ ధన్సిక?
  • Manoj and Vishnu
    శివయ్య అని పిలిస్తే రాడు!

ఇతర న్యూస్

  • రూ.6 కోట్లు చేజారిపోతాయా?
  • కనకమేడల అసందర్భ ప్రకటన
  • పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!
  • బన్నీకి ఈ భామలు ఫిక్స్!
  • వీళ్లకు అంత సీనుందా?
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us