
ఎప్పుడైతే సంధ్యా థియేటర్ లో దుర్ఘటన జరిగిందో అప్పుడే ప్రీమియర్స్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చాలామంది ఊహించారు. అంతా ఊహించినట్టుగానే ప్రీమియర్స్ పై నిషేధం విధిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి ప్రకటన చేశారు.
కోమటిరెడ్డి చెప్పిన ఈ విషయం అధికారికమైతే కనుక అది దిల్ రాజుకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే, రాబోయే సంక్రాంతి సినిమాల్లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలే 2 ఉన్నాయి కాబట్టి.
ఈ సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలున్నాయి. వీటిలో ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రెండూ దిల్ రాజువే. ఇక ‘గేమ్ ఛేంజర్’ అయితే భారీ బడ్జెట్ సినిమా.
ఈ సినిమాలు రికవర్ అవ్వాలంటే సంక్రాంతి బరిలో కచ్చితంగా ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు ఉండాల్సిందే. మొన్నటివరకు దిల్ రాజు ఆశ కూడా ఇదే. ‘పుష్ప-2’ టైపులో ముందు రోజు నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు మొత్తం తలకిందులైంది. ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తాడో చూడాలి.