“నెక్ట్స్ ఏంటి.. ఈ గోలేంటి… ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి ” అంటూ ఓ సాంగ్ ఉంది. ఇప్పుడు హీరో రామ్ పరిస్థితి అలాగే ఉంది.
లెక్క ప్రకారం, “డబుల్ ఇస్మార్ట్” పూర్తయిన వెంటనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” డైరెక్షన్లో మరోటి చెయ్యాలి. హరీష్ శంకర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది అని భావించారు. కానీ హరీశ్ శంకర్ తీసిన “మిస్టర్ బచ్చన్” ఫ్లాప్ అయింది. ఇటు రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఫ్లాప్.
దాంతో రామ్ కి ఇబ్బంది వచ్చి పడింది. హరీష్ ఫ్లాప్ ఇవ్వడం కన్నా ఎక్కువ ట్రోలింగ్ కి గురి కావడం వల్లే పెద్ద చిక్కు. అందుకే రామ్ వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడు పి. మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు పి. ఎమోషన్స్ తో పాటు, మంచి కామెడీ తీయగలనని నిరూపించుకున్నాడు. ఇతడు రామ్ కు ఓ స్టోరీ వినిపించాడు. రామ్ కు కూడా అది నచ్చింది.
ప్రస్తుతం రామ్ ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది కూడా వద్దనుకుంటే కెరీర్ లో రామ్ చిన్న గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఇక హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీ చెయ్యడానికి ఇంకా కొంత టైం తీసుకుంటాడు అని అంటున్నారు.