సంక్రాంతి 2025 పండుగ సినిమాల విడుదల తేదీల్లో చాలా మార్పులు జరిగాయి. ముందుగా ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొని సమ్మర్ కి వెళ్ళింది. మొన్నటి వరకు సంక్రాంతికి పక్కాగా అనుకున్న “విశ్వంభర” కూడా సంక్రాంతికి రావడం లేదు. ఆ స్థానంలో ‘గేమ్ ఛేంజర్’ వస్తుందని ఇటీవలే ప్రకటించారు దిల్ రాజు.
ఈ సినిమాతో పాటు వెంకీ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సంక్రాంతికే రానుంది. టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టబోతున్నారు.
డిసెంబర్ లో రావాలనుకున్న బాలకృష్ణ-బాబి సినిమా కూడా సంక్రాంతికి రానుంది. చిరంజీవి వాయిదా పడడంతో బాలయ్య మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ విషయాన్ని నిర్మాత ప్రకటించారు.
సో, రామ్ చరణ్ వర్సెస్ వెంకటేష్ వర్సెస్ బాలయ్య అనేది దాదాపు ఫిక్స్ అయిపోయింది. అటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే డబ్బింగ్ సినిమా ఎప్పట్నుంచో లైన్లో ఉంది.
మూడు తెలుగు సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా ఈ సంక్రాంతికి వస్తాయి.