గత నెలలో తన ప్రియుడు మతిస్ బోని పెళ్లాడింది తాప్సి. ఇప్పటివరకు ఆమె తన పెళ్లి గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా అప్డేట్ చెయ్యలేదు. కానీ నిన్న, మొన్నా ఆమె పెళ్లి వీడియోలు లీక్ అయ్యాయి. దాంతో ఈ భామ ఇప్పుడు స్పందించక తప్పలేదు.
లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా
– “కేవలం వృత్తినే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని అనుభవించాలి.”
– “పోటీ మంచిదే కానీ టాప్ కి వెళ్ళాలి అనే ప్రయత్నంలో నిజమైన జీవితాన్ని కోల్పోతాం. నెంబర్ వన్ స్తానం అనేది ఉండదు. అది తెలుసుకునే సరికి చాలా కోల్పోతాం. అందుకే నా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అని నిర్ణయించుకొని ఈ అడుగు వేశా.”
– “ఇకపై ఒప్పుకునే సినిమాలు కూడా నా మనసుకు నచ్చేలా ఉండేలా చూసుకుంటాను. ఏది పడితే అది ఒప్పుకోను.”
ALSO READ: Leaked wedding video: Tapsee dances her heart out
పెళ్లి కెరీర్ కి అడ్డు కాదని ఇప్పటికే పలువురు హీరోయిన్లు నిరూపించారు. ఆ మాటకొస్తే దీపిక, అలియా భట్, కియారా అద్వానీ వంటి భామలు పెళ్లి తర్వాత కూడా మంచి గ్లామర్ రోల్స్ చేస్తూ టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
– “సినిమాలు కంటిన్యూ చేస్తాను. కొన్నాళ్ల తర్వాత చూసినా నచ్చేలా ఉండే కథలు మాత్రమే ఒప్పుకుంటాను.”