సన్నీ లియోన్ కి పెళ్ళై చాలా ఏళ్ళు అయింది. ఆమెకి ముగ్గురు పిల్లలు. ఇప్పుడు ముగ్గురు పిల్లల సమక్షంలో ఆమె మరోసారి పెళ్లి చేసుకొంది. పెళ్లి రెండో సారి కానీ భర్త ఒక్కరే.
“మొదటిసారి మేం దైవసన్నిధానంలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మేము ఐదుగురం ఆనందంగా వివాహ వేడుక జరుపుకున్నాం,” అంటూ తన రెండో పెళ్లి వీడియోని ఆమె షేర్ చేసింది.
సన్నీ లియోన్ 2018లో డేనియల్ వెబర్ (Daniel Weber)ని పెళ్లాడింది. వీరికి ముగ్గురు పిల్లలు. మొదట ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ పద్దతిలో ఇద్దరు కవలలు పుట్టారు. ఈ ముగ్గురు పిల్లల సమక్షంలో వీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.
సన్నీ లియోన్ శృంగార చిత్రాల తారగా (పోర్న్ స్టార్) కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ఆమెకి ఇప్పుడు 43 ఏళ్ళు.