
సినిమాల పరంగా శ్రీలీల ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు కానీ, స్పెషల్ సాంగ్ పరంగా చూసుకుంటే ఆమెది సూపర్ హిట్ రికార్డ్. ‘పుష్ప-2’లో ఆమె చేసిన ‘కిస్సిక్ సాంగ్’ ఇప్పటికీ యూట్యూబ్ లో మోతమోగిస్తూనే ఉంది.
ఇప్పుడీ ముద్దుగుమ్మను మరో ఐటెంసాంగ్ వరించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ఐటెంసాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించారట. చరణ్ సినిమా కాబట్టి శ్రీలీల నో చెప్పే ఛాన్స్ లేదు.
ఎటొచ్చి నిజంగానే ఆమెను సంప్రదించారా లేదా అనేది తేలాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే రామ్ చరణ్ ఇండియాకు తిరిగి రావాలి. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి లండన్ వెళ్లాడు. టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాడు.
తిరిగొచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమాకు సంబంధించి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకుడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.