
శ్రీలీల ఇప్పటివరకు నటి మాత్రమే. ఇకపై ఆమె డాక్టర్ కూడా. అవును.. ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ఫుల్ గా తన మెడిసిన్ కోర్సు పూర్తి చేసింది. స్పెషలైజేషన్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు వెల్లడించింది.
హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలకు సైన్ చేస్తోంది. కాబట్టి ఇప్పట్లో స్పెషలైజేషన్ చేసే ఆలోచనలు లేవని, భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా చేస్తానని చెబుతోంది.
తాజాగా ఫైనల్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయంట. అందులో తను పాసయ్యానని, అధికారికంగా వైద్యురాలిగా మారానని, ఆ సంతోషంలోనే రీసెంట్ గా తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నానని వెల్లడించింది శ్రీలీల.
తిథి ప్రకారం జరుపుకునే పుట్టినరోజు నాడు, అమ్మాయిని బుట్టలో పెట్టి తోబుట్టువులు మోయడం తమ కుటుంబంలో ఓ సంప్రదాయమని, తాజాగా తన పుట్టినరోజు నాడు అదే పనిచేశామని తెలిపింది శ్రీలీల. అయితే ఆ ఫొటోను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని, తన పెళ్లి అని భావించారని అంటోంది.















