
ప్రభాస్ ఇంకా ఇటలీలోనే ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు మేటర్ ఏంటంటే, ఈ హీరో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. అంతేకాదు, త్వలోనే ‘రాజాసాబ్’ సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
‘రాజాసాబ్’ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ కొత్త షెడ్యూల్ లో సంజయ్ దత్ జాయిన్ అయ్యారు. త్వరలోనే ప్రభాస్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. సంజయ్ దత్, ప్రభాస్ కాంబోలో సన్నివేశాలు తీయబోతున్నాడు దర్శకుడు మారుతి.
మొన్నటివరకు ఇటలీలో ఛిల్ అయ్యాడు ప్రభాస్. అక్కడ ప్రభాస్ కు అందమైన భవంతి ఉంది. స్నేహితులతో కలిసి అందులోనే గడిపిన ప్రభాస్, 2 రోజుల కిందటే హైదరాబాద్ వచ్చాడు. ‘రాజాసాబ్’ షెడ్యూల్ తర్వాత అతడు ‘ఫౌజీ’ సెట్స్ లో జాయిన్ అవుతాడు. ఈ గ్యాప్ లో ‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించబోతున్నారు.
“రాజాసాబ్” గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటోంది. అనేకసార్లు వాయిదా పడింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.