మొత్తానికి పాయల్ అన్నంత పని చేసింది. తన పంతం నెగ్గించుకుంది. తను నటించిన “రక్షణ” సినిమా ప్రచారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహరించింది. పాయల్ ప్రచారం లేకుండానే “రక్షణ” సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది.
ఈ సినిమా విషయంలో ప్రచారానికి పాయల్ ను రప్పించేందుకు దర్శక-నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ గట్టిగా ప్రయత్నించాడు ఫిలింఛాంబర్ లో కంప్లయింట్ చేశాడు. అట్నుంచి అటు పంచాయితీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వెళ్లింది. ఆ తర్వాత పాయల్ కొంత తగ్గింది.
ఇంత జరిగినా పాయల్ ఈ సినిమాకు ప్రచారం చేయలేదు. తనకు బ్యాలెన్స్ ఎమౌంట్ ఇవ్వలేదని, రిలీజ్ డేట్ గురించి సమాచారం అందించలేదని, పైపెచ్చు తనను బూతులు తిట్టారని పాయల్ ఆరోపించింది.
నాలుగేళ్ల కిందటి ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసి, తన ఇమేజ్ ను పాడుచేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారనేది పాయల్ మనసులో మాట. థియేటర్లలో కాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుంటే బాగుండేదని ఆమె బయటకు ప్రకటించిన సంగతి తెలిసిందే.