ఉన్నదున్నట్టు మాట్లాడి అందర్నీ ఆకర్షించాడు హీరో నారా రోహిత్. తను నటించిన “ప్రతినిధి-2” సినిమా డిజాస్టర్ అయిందని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.
ఈ హీరో నటించిన తాజా చిత్రం “సుందరకాండ.” ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు రోహిత్. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మొహమాటంకొద్దీ “ప్రతినిధి-2 ” బాగా ఆడిందని అన్నాడు. అది విన్న నారా రోహిత్ వెంటనే ఫక్కున నవ్వేశాడు.
“ప్రతినిధి-2 ఎక్కడ హిట్టయిందండీ బాబూ.. నాక్కూడా తెలియదు” అంటూ అనేశాడు. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిందో లేదో కూడా చాలామందికి తెలియదని అన్నాడు.
ALSO READ: ఇన్నేళ్లకి హీరోయిన్ గా రీఎంట్రీ
నారా రోహిత్ సింప్లిసిటీని అంతా మెచ్చుకున్నారు. తనకు ఆల్రెడీ జుట్టు పండిపోయిందని, కలర్ వేసుకొని మేనేజ్ చేస్తున్నాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు రోహిత్.
Advertisement