సిద్ధార్థ్ కి ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది. అది ఇప్పుడు పోయింది. తమిళంలో కూడా అంతగా ఏమి లేదు. ఆ మధ్య ఒక సినిమా మంచి పేరు వచ్చినా శంకర్ తీసిన “ఇండియన్ 2” దారుణ పరాజయం తర్వాత సిద్ధార్థ్ మార్కెట్ మరింత దిగజారింది. ఇలాంటి టైంలో “మిస్ యూ” అంటూ ఒక సినిమాని తీసుకొస్తున్నాడు.
గత నెలల్లో విడుదల కావలసిన ‘మిస్ యు’ సినిమా వాయిదా పడింది.ఈ డిసెంబర్ 13న విడుదల కానుంది. అటు పుష్ప 2 థియేటర్లో ఉండగా, ఇది రిలీజ్ అవుతోంది.
సిద్దార్థ్ సరసన అషికా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏషియన్ సురేష్ సంస్థ రిలీజ్ చేయబోతోంది. మరి ఈ సినిమాతోనైనా సిద్ధూకి చెప్పుకోదగ్గ విజయం వస్తుందా?
సిద్ధార్థ్ ఇటీవలే అదితి రావును పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోనే ప్రస్తుతం మకాం. ఇలా అడపాదడపా వచ్చే సినిమాలు చేస్తున్నాడు.