
నాగచైతన్య ప్రస్తుతం “తండేల్” సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 7న సినిమా రాబోతోంది. త్వరలోనే కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య మూవీ (#NC24)చేయబోతున్నాడు.
అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ లో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ కోసం ఏకంగా 110 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట.ఇందులో రూ.30 కోట్లు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారట.
అన్నట్టు ఇందులో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని టాక్ మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు అంటున్నారు. నాగచైతన్య, మీనాక్షిది ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది.
ASLO READ: Meenakshi Chaundhary completes the 2024 quota
మీనాక్షి ఈ ఏడాది ఐదు సినిమాలు విడుదల చేసింది. సంక్రాంతికి మరో సినిమా విడుదల చేస్తుంది. సో, 2025లో ఈ అమ్మడి రెండో సినిమా నాగ చైతన్యదే అవుతుందన్నమాట. ఐతే, మీనాక్షికి నిజంగా ఈ ఆఫర్ దక్కిందా అనేది చూడాలి. అధికారిక ప్రకటన వచ్చేంతవరకు సస్పెన్స్.