కలర్స్ స్వాతి హీరోయిన్ గా మళ్ళీ బిజీ అవుతోంది. ఆమె డిఫెరెంట్ చిత్రాలను ఎంచుకుంటోంది. ఆమె కొత్తగా చేస్తోన్న మూవీ… టీచర్.
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే కథనంతో తెరకెక్కుతోంది “టీచర్” అనే ఈ మూవీ. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు.
అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది.
ఇటీవల “90స్- ఎ మిడిల్ క్లాస్” బయోపిక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ నుంచి వస్తోంది ఈ సినిమా. ఆదిత్య హసన్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్ అఫిషియల్ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.