
మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అంబటి రాయుడు నోరు పారేసుకున్నాడు. నిన్న జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ లో సెలబ్రిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు రాయుడు. వాళ్లంతా కేవలం పబ్లిసిటీ కోసం మ్యాచ్ కు వచ్చారంటూ సెటైర్లు వేసి విమర్శల పాలయ్యాడు.
దుబాయ్ లో జరిగిన మ్యాచ్ చూడ్డానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరక్టర్ సుకుమార్ తో పాటు చాలామంది హాజరయ్యారు. వీళ్లలో సంతోష్, నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకులు, ఊర్వశి రౌతేలా, సన్నీ లియోన్ లాంటి తారలు కూడా ఉన్నారు.
ఒక దశలో కెమెరా సుకుమార్ వైపు టర్న్ అయింది. అది చూసిన కామెంటేటర్, “ప్రైడ్ అఫ్ తెలుగు సినిమా సుకుమార్” అంటూ రియాక్ట్ అయ్యాడు. ఈసారి చాలామంది తెలుగువాళ్లు వచ్చారన్నాడు. దీన్ని రాయుడు లైట్ తీసుకున్నాడు.
ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది కాబట్టి, టీవీల్లో కనిపిస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని చాలామంది మ్యాచులకు వచ్చారంటూ విమర్శలు చేశాడు. దీంతో రాయుడిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
చిరంజీవి లాంటి మెగాస్టార్ కు పబ్లిసిటీ అవసరమా… సుకుమార్ లాంటి డైరక్టర్ ఫ్రీ పబ్లిసిటీ కోసం వెంపర్లాడతాడా… అంటూ రాయుడ్ని ట్రోల్ చేస్తున్నారు.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వేల కిలోమీటర్లు ప్రయాణించి క్రికెట్ మ్యాచులకు వచ్చేది ఇండియాపై అభిమానంతో తప్ప, పబ్లిసిటీ కోసం కాదని, ఈ విషయాన్ని రాయుడు గ్రహిస్తే బాగుంటుందని అంటున్నారు.