
‘తండేల్’లో నాగచైతన్య హీరో, దర్శకుడు చందు మొండేటి. మరి ఈ సినిమాకు హీరో అల్లు అర్జున్ కు ఏమైనా సంబంధం ఉందా? ఉందంటున్నారు నిర్మాత అల్లు అరవింద్.
‘తండేల్’ సినిమాకు సంబంధించి ఓ కీలకమైన నిర్ణయం విషయంలో బన్నీ సూచన బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ మేటర్ ఏంటో చూద్దాం..
ఒక టైమ్ లో ‘తండేల్’, ‘పుష్ప-2’ ఒకేసారి నడిచాయంట. చైతూ సినిమా కోసం దేవిశ్రీని తీసుకోవాలనేది ప్రతిపాదన. దీనికి అల్లు అరవింద్ నో చెప్పారు. ‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్న దేవిశ్రీని యూనిట్ బయటకు పంపించదని, అంత బిజీలో దేవిశ్రీ కూడా సరిగ్గా వర్క్ చేయలేడేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఇంట్లో డిన్నర్ చేస్తున్న టైమ్ లో అల్లు అర్జున్ తో ఇదే విషయం చెప్పారంట అరవింద్. ‘తండేల్’ లాంటి ప్రేమకథకు దేవిశ్రీ అయితేనే పూర్తి న్యాయం చేస్తాడని, అతడ్ని మాత్రమే తీసుకోవాలని బన్నీ సూచించాడట. అలా నాగచైతన్య సినిమాలో దేవిశ్రీ వచ్చాడని, ఆ క్రెడిట్ బన్నీకి ఇస్తానని అన్నారు అరవింద్.