శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ హీరోగా “కుబేర” అనే సినిమా తీస్తున్నారు. ఆయన కేరీర్లో సూపర్ హిట్ చిత్రమైన “హ్యాపీ డేస్” రీరిలీజ్ సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చట్లు….
25 సంవత్సరాల కెరీర్ గురించి…
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమాలు తీస్తూ వస్తున్నాను. ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదు అనేది పాటిస్తున్నాను. నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు. అలా అని సినిమాలూ తీయలేదు. అదే నాకు గర్వంగా వుంది.
చాలా స్లోగా తీస్తారు ఎందుకు?
కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటాను. చెప్పేది సూటిగా వుంటుంది. మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా తొందరగా చేయాలనుకోను. అలా చేస్తే గడిబిడి అయిపోతాం. మేకింగ్ పరంగాచాలా ఫాస్ట్ గా వుంటాను. కానీ థింకింగ్ పరంగా స్లోగా వుంటాను.
కుబేర గురించి చెప్పండి...
థనుష్, నాగార్జున, రష్మిక మందాన నటిస్తున్నారు. పెద్ద స్కేల్, పెద్ద ఐడియాతో తీస్తున్నాను. నాగార్జున, ధనుష్ అనే వారు కథకు యాప్ట్ అని చేస్తున్నా.ఈ కథ ఫిలాసఫీలో చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది.
మళ్ళీ జాతీయ అవార్డుల కోసం సినిమా తీస్తారా?
నేను కాంప్రమైజ్ కాకుండా సినిమాలు తీస్తున్నాను. అందుకే నేను హ్యాపీగా వున్నాను. ప్రజలు ఇచ్చే అవార్డే గొప్పది. అవార్డు అనేది సడెన్ గా వస్తుంటాయి. మనకంటే బెటర్ గా సినిమాలు నేషనల్ లెవల్ లో వుంటున్నాయి. వాటినీ అంగీకరించాలి. ఏడాది ఏడాదికి జాతీయ స్థాయిలో అంచనాలు మారుతుంటాయి. కంటెంట్ పరంగా మంచిది తీసుకుని చేయడమే మన పని.