
నాని త్వరలో మొదలుపెట్టనున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మొదటి టీజర్ విడుదల అయింది. అందులో నాని ఒళ్ళంతా పచ్చబొట్టులతో రెండు జెడలు వేసుకొని కనిపించాడు. చేతిపైన “ల..కొడుకు” అని కూడా టాట్టూ వేయించుకున్నాడు.
ఆ టీజర్ విడుదల కాగానే నాని ట్రాన్స్ జెండర్ పాత్ర పోషిస్తున్నాడు అని సోషల్ మీడియా హోరెత్తింది. నాని లుక్ అలాగే ఉంది అని అందరూ అలా అంచనాకు వచ్చారు.
ఐతే, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఇది “మ్యాడ్ మాక్స్” చిత్రంలా ఉంటుంది అని అంటున్నారు. సికింద్రాబాద్ నేపథ్యంగా సాగే పీరియడ్ చిత్రం ఇది. ఇండియా నుంచి ఇప్పటివరకు “మ్యాడ్ మాక్స్” తరహా చిత్రం రాలేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అని నాని చెప్తున్నారు. తన పాత్ర ట్రాన్స్ జెండరా లేక వేరే విచిత్ర వేషధారి పాత్రనా అన్నది థియేటర్లో చూడాలి అంటున్నారు నాని.
ఇటీవల “శ్రీ విష్ణు” ట్రాన్స్ జెండర్ లా “స్వాగ్” అనే సినిమాలో కనిపించాడు. కానీ ఆ సినిమా ఆడలేదు.