
హీరోయిన్లకు కూడా కోరికలుంటాయి, టార్గెట్స్ ఉంటాయి. వాటిని సాధించుకునేందుకు వాళ్లు కష్టపడుతుంటారు కూడా. మీనాక్షి చౌదరికి కూడా అలాంటి మూడు కోరికలున్నాయి. వాటిలో 2 కోరికల్ని ఆమె తీర్చుకుంది. మూడోది బ్యాలెన్స్.
“వయసు పెరిగేకొద్దీ 3 కలలు కనేదాన్ని. అందులో ఒకటి డాక్టర్ అవ్వాలనే కల. రెండోది మిస్ ఇండియా అవ్వాలి. ఇక మూడోది సివిల్ సర్వెంట్. మొదటి రెండు కలలు నెరవేరాయి. మూడోది మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాను.”
సివిల్ సర్వెంట్ అవ్వాలనే ఆమె కోరిక బహుశా తీరకపోవచ్చు. ఎందుకంటే, ఆమె సినిమాలతో తెగ బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడామెనే లీడింగ్ హీరోయిన్. ఈ ఏడాది లైనప్ కూడా బ్రహ్మాండంగా ఉంది.
“ఈ ఏడాది ఎక్సయిటింగ్ సినిమాలున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని ఎనౌన్స్ మెంట్స్ వస్తాయి. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నాను. మరో 2 పైప్ లైన్లో ఉన్నాయి. ఈ ఏడాది మంచి పాత్రలు పోషిస్తున్నాను.”
రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చింది మీనాక్షి చౌదరి. సంక్రాంతి బరిలోనే కాదు, వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ మూవీ. మీనాక్షికి కెరీర్ కు కూడా అద్భుతంగా కలిసొచ్చింది.