
నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను 2023లో పెళ్లి చేసుకుంది కియరా అద్వానీ. ఈ ఏడాది ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే పిల్లలపై తన ఆలోచనలను ఆమె 2019లోనే, అంటే పెళ్లికి ముందే బయటపెట్టింది.
ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు కియరా గతంలో స్పందించింది. ఎప్పుడైతే తను కడుపు నిండా, నచ్చిన భోజనం తినాలని డిసైడ్ అవుతానో అప్పుడు పిల్లల్ని కంటానని చెప్పుకొచ్చింది.
హీరోయిన్లు నిత్యం డైటింగ్ లో ఉంటారనే విషయం తెలిసిందే. కియరాకు ఆ స్పృహ ఇంకాస్త ఎక్కువ. రోజూ వ్యాయమం చేస్తుంది, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. ఒక్కోసారి అవన్నీ వదిలేయాలని అనిపిస్తుందని, గర్భం దాలిస్తే అవన్నీ వదిలేయొచ్చు కదా అంటూ జోక్ చేసింది.
ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చింది.
ALSO READ: Kiara Advani and Sidharth Malhotra announce pregnancy

మరోవైపు కవలలపై కూడా స్పందించిందామె. తనకు కవలలు కనాలనే కోరిక లేదని, పుట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా ఆరోగ్యంగా ఉంటే చాలని చెప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కియారాకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.