“మీ జీవితం మీ ఇష్టం… బయటకొస్తే ఏమైనా అంటాం” అనేది సోషల్ మీడియా కామన్ స్లోగన్. అందుకే ఎవ్వరు ఎప్పుడు ఎలా ట్రోలింగ్ కు బలిపశువులుగా మారతారో అస్సలు ఊహించలేం. ఇలాంటివి దీపిక పదుకోన్ కు కొత్త కాదు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో అవమానాలు, మరెన్నో ట్రోలింగ్స్ చూసింది దీపిక. ఇప్పుడు ఆమె ముద్దుల కూతురు చుట్టూ ట్రోలింగ్ మొదలైంది.
దీపిక కూతురు వయసు అటుఇటుగా 2 నెలలు మాత్రమే. ఇప్పటివరకు పాప ముఖాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయలేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పట్లో పాప ముఖాన్ని బయటపెట్టే ఉద్దేశం కూడా ఆమెకు లేదు. అంతలోనే ఆ చిన్నారి
తాజాగా తన కూతురుకు నామకరణం చేసింది దీపిక. కూతురుకు దువా అనే పేరు పెట్టింది.
దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. దువా అనేది ఇస్లాం పదం కదా, ఆ పేరు ఎందుకు పెట్టారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. అదే అర్థం వచ్చేలా ప్రార్థన అనే పేరు పెడితే బాగుండేదని సూచిస్తున్నారు. పాప పూర్తి పేరు దువా పదుకోన్ సింగ్.