
హీరోయిన్లపై కామెంట్స్ సర్వసాధారణం. చాలా విమర్శల్ని వాళ్లు లైట్ తీసుకుంటారు కూడా. అయితే బాడీ షేమింగ్ ను మాత్రం వాళ్లు తట్టుకోలేరు.
అలా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చిన ప్రతిసారి వాళ్లు కుంగిపోతుంటారు. అలాంటి కుంగుబాటును తను కూడా చవిచూశానంటోంది హీరోయిన్ అనన్య పాండే.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెను కోడి కాళ్ల సుందరి అని కొంతమంది పిలిచేవారంట. దీనికి కారణం ఆమె కాళ్లు సన్నగా, బలహీనంగా ఉండడమే. సాధారణం జనం ఆ కామెంట్స్ చేస్తే తను పట్టించుకునేదాన్ని కాదని, ఇండస్ట్రీ జనాలే అలా పిలిచేసరికి చాలా కుంగిపోయానని చెప్పుకొచ్చింది.
పరిశ్రమలో కొనసాగాలంటే పెర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలని, ఆ క్రమంలో తను కూడా బాగా సన్నబడినట్టు అంగీకరించింది అనన్య పాండే. అలా సన్నబడే క్రమంలో తన కాళ్లు మరింత పల్చగా మారిపోయానని ఆమె తెలిపింది. ఆ తర్వాత ఈ విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది అనన్య.
కేవలం కాళ్లపైనే దృష్టిపెట్టి కొన్ని వ్యాయామాలు చేసింది. ఆకర్షణీయమైన లెగ్స్ సొంతం చేసుకుంది. అప్పుడు ఎవరైతే తనను వెక్కిరించారో, ఆ తర్వాతే వాళ్లే తన కాళ్లను మెచ్చుకున్నారని అంటోంది అనన్య పాండే.