
ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనీ, డిప్యూటీ సీఎం తాలూకా అని కార్లపై, బైక్ లపై స్టికర్లు వేసుకున్నారు. టీ షర్ట్ లపై ముద్రించుకున్నారు.
తాజాగా అల్లు అర్జున్ బ్రహ్మానందం ఫోటోతో కూడిన టీ షర్ట్ ధరించి వైరల్ అయ్యాడు.
ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమావేశంలో హాజరయ్యేందుకు ఈ రోజు ముంబై వెళ్ళాడు అల్లు అర్జున్. అక్కడ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఈ టీ షర్ట్ తో కనిపించాడు. ‘‘నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా’’ అని బ్రహ్మానందం ఫొటోలతో కూడిన ఈ టీ షర్ట్ వైరల్ అయింది.
అల్లు అర్జున్ – బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన ‘రేసుగుర్రం’ బ్లాక్ బస్టర్ అయింది. బ్రహ్మికి బన్నీ పెద్ద ఫ్యాన్. అందుకే ఈ టీ షర్ట్ ధరించాడు.