
“వార్ 2” సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో. మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు ఉంటాయి. ఐతే, ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ కాదు, మరో హీరోనే.
ఆగస్టు 14న విడుదల కానుంది… “వార్ 2”. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా “సయిరా” సినిమా కోసం ట్రైలర్ విడుదలని వాయిదా వేశారు. మొదటి వీకెండ్ “సయిరా” అదరగొట్టింది. సినిమా పెద్ద హిట్ దిశగా వెళ్తోంది. దాంతో, ఆ సినిమాని నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్ ….ఇప్పుడు “వార్ 2” ప్రచారంపై ఫోకస్ నిలిపింది.
ఈ నెల 25న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది యష్ రాజ్ ఫిలిమ్స్.
ఇంతకుముందు విడుదలైన “టీజర్”కి ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ట్రైలర్ కి వచ్చే స్పందనని బట్టి “వార్ 2” వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పొచ్చు.















