
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. కానీ సంక్రాంతికి విడుదల చెయ్యాలనే లక్ష్యంతో షూటిం ని జరుపుతున్నారు. మరోవైపు, వచ్చే నెల మెగాస్టార్ బర్త్ డే ఉంది. ఆగస్టు 22న మెగాభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే సినిమా టైటిల్ టైటిల్ ప్రకటించాలి.
అందుకే, అనిల్ రావిపూడి ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. ఆయన మూడు నాలుగు టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. అందులో ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అసలు పేరు కూడా అదే. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే పేరుని చిరంజీవి తల్లితండ్రులు పెట్టారు. ఐతే, సినిమాల్లో నటుడిగా మారాలనుకున్న తర్వాత ఆయన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్నారు.
ఇప్పుడు చిరంజీవి సొంత పేరు ఆయన కొత్త సినిమాకి టైటిల్ అయ్యేలా ఉంది.















