
బోల్డ్ గా మాట్లాడ్డం సంజయ్ దత్ స్టయిల్. విషయం ఏదైనా ఆయన అభిప్రాయాలు సూటిగా ఉంటాయి. తాజాగా నాగార్జున, చిరంజీవిపై కూడా అదే విధంగా తన ఒపీనియల్ బయటపెట్టారు ఈ సీనియర్ నటుడు.
ఓ కన్నడ సినిమా చేశారు సంజయ్ దత్. ఆ సినిమా తెలుగు ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి సంజయ్ దత్ ను ప్రశ్నించారు. నాగార్జున తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు సంజయ్ దత్. ఆయన సినిమాలో గతంలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అదే టైమ్ లో మీడియా అడక్కపోయినా చిరంజీవి గురించి ప్రస్తావించారు. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని మెచ్చుకున్నారు. తను నటించిన సినిమాను చిరంజీవి రీమేక్ చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ నటుడు, ప్రభాస్ తో కలిసి ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నారు. అందరికీ తినిపించినట్టుగానే, ప్రభాస్ తనకు కూడా చాలా రుచులు తినిపించాడని చెప్పుకొచ్చారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు.















