
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “వార్ 2” టీజర్ రాబోతుంది అని ఆ సినిమా టీం నాలుగు రోజుల క్రితమే ప్రకటించింది. ఈ హిందీ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ యుద్ధం ఎలా ఉంటుంది అని ఈ రోజు ఉదయం వరకు అందరూ రకరకాల అంచనాలు వేసుకున్నారు. తీరా టీజర్ వచ్చాక అసలు దృష్టి, అందరి డిస్కషన్ వేరే వైపు వెళ్ళింది.
ఈ టీజర్ లో కొన్ని సెకండ్ల పాటే కనిపిస్తుంది కియారా అద్వానీ. కానీ ఆ క్షణాల్లోనే అందరిని తనవైపు తిప్పుకొంది. మొదటిసారిగా వెండితెరపై బికినీ ధరించి అదరగొట్టింది.
“అందరూ ఎన్టీఆర్, హృతిక్ అదరగొడుతారని భావించారు. కానీ కియారా అవుట్ అఫ్ సిలబస్ లా వచ్చింది,” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి. అంతగా ఆమె అందరి అటెన్షన్ లాగేసింది.
బ్యాక్, ఫ్రంట్, సైడ్ ఇలా అన్ని షాట్స్ వేసి కుర్రాళ్లకు కన్నుల పండుగ చేశారు. యష్ రాజ్ సంస్థ నిర్మించే యాక్షన్ చిత్రాల్లో హీరోలు తమ కండలు చూపించడం, సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించడం చాలా కామన్. అలాగే ప్రతి హీరోయిన్ తో బికినీ వేయిస్తారు. అలా కియారా అద్వానీ మొదటిసారి ఇలా బికినీ షో చేసింది.
ALSO READ: Kiara Advani slays: Baby Bump to Bikini Bod
కియారా అద్వానీ ప్రస్తుతం గర్భవతి. ఆమె, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా మొదటి బేబీ కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నన్సీ లీవ్ లో ఉంది. కానీ ఆమె గతేడాదే ఈ బికినీ షూట్ పూర్తి చేసింది.