
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం ఉంది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనేది అందరికీ తెలుసు. పెళ్లి కూడా త్వరలోనే చేసుకుంటారు అనేది మరో మాట.
ఐతే, విజయ్ కానీ, రష్మిక కానీ ఇప్పటివరకు తమ ప్రేమ గురించి బహిరంగంగా ప్రకటించలేదు. ఇదే విషయాన్నీ అడిగితే, విజయ్ దేవరకొండ రష్మికతో పెళ్లి విషయాన్ని దాటవేశాడు. “రష్మిక మంచి వ్యక్తి. మంచి నటి,” అని సమాధానం ఇచ్చాడు.
“ఆమెతో ఇప్పటికే రెండు సినిమాలు చేశాను. రష్మికతో మరిన్ని సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నాను,” అని చెప్పాడు విజయ్ దేవరకొండ.
“పెళ్లి చేసుకుంటాను కానీ అది ఇప్పుడే కాదు,” అంటూ ఇప్పుడే పెళ్లి ప్లాన్స్ లేవని క్లారిటీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఒక కొత్త సినిమాలో నటిస్తున్నారు.