
చాలామంది హీరోయిన్లకు ఈ ఫీలింగ్ ఉంటుంది. ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అయితే నలుగురిలో నలగొచ్చని, పాపులర్ అవ్వొచ్చని భావిస్తుంటారు. అయితే అదంతా గాలిబుడగ మాదిరి.
ఓ హాట్ స్టేట్ మెంట్ ఇచ్చి, వివాదాస్పద ప్రకటన చేసి, లేక ఇంకేదైనా వివాదంలో పడి 4 రోజులు అందరి దృష్టిని ఆకర్షించొచ్చు కానీ అది కెరీర్ కు ఏమాత్రం కలిసిరాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్వీ మల్హోత్రా.
బహుశా, టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఇంత వివాదాస్పదమైన హీరోయిన్ మరొకరు లేరేమో. తననుతాను రాజ్ తరుణ్ కు భార్యగా చెప్పుకున్న లావణ్య అనే అమ్మాయి, మాల్వీ మల్హోత్రాను సీన్ లోకి లాగింది. రాజ్ తను తన నుంచి దూరం చేస్తోందంటూ మాల్వీపై విరుచుకుపడింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. దాదాపు 2 నెలల పాటు సాగిన ఆ వివాదంతో మాల్వీ పేరు మార్మోగిపోయింది. ఏ స్టార్ హీరోయిన్ కు రానంత బజ్ ఆమెకు వచ్చింది.
కట్ చేస్తే, అదంతా కొన్ని రోజుల వ్యవహారంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఎప్పటికప్పుడు ఆమె ఫొటోషూట్స్ రిలీజ్ చేస్తోంది. నలుగుర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఛాన్సులు మాత్రం రావడం లేదు.