
దేశంలో ఉన్న 100 మంది ప్రభావశీలమైన యువతుల్లో ఒకరుగా పేరొందింది శ్రీలీల. “100 Most Influential Young People” అంటూ తాజాగా ఒక మేగజైన్ జరిపిన సర్వేలో శ్రీలీలకు చోటు దక్కింది.
శ్రీలీలకి దేశవ్యాప్తంగా ఇంత క్రేజు ఉందా అనే డౌట్ మనకి రావొచ్చు. ఐతే, ఆమె “కిస్సిక్” అనే ఐటెం సాంగ్ (పుష్ప 2)తో నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. అందుకే, సర్వేలో ఈ భామకి చోటు దక్కింది.
శ్రీలీల వయసు కేవలం 23 ఏళ్ళు. ఎంబీబీఎస్ చదువుకొంది. పాతికేళ్లలోపే పేరు, డబ్బు, క్రేజ్ పొందింది ఈ తెలుగు భామ.
ఇక ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా సక్సెస్ అయితే ఆమె ఇన్ ఫ్లుయెన్స్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం అక్కర్లేదు. తెలుగులో మంచి హిట్ కొట్టేందుకు కష్టపడుతోంది. కానీ త్వరలోనే విడుదల కానున్న రెండు తెలుగు సినిమాలు ఆ కొరత తీర్చొచ్చు.
ప్రస్తుతం ఆమె రవితేజ సరసన “మాస్ జాతర” సినిమాలో నటిస్తోంది. ఇక అఖిల్ అక్కినేని సరసన “లెనిన్” అనే మూవీ చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన “ఆషికి 3” మూవీలో నటిస్తోంది.