
ప్రభాస్ సినిమాలు ఏవి ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరి మూడు సెట్స్ మీదకి వెళ్ళాలి అనుకుంటున్నాయి. దాంతో, ఈ అరడజన్ చిత్రాల చుట్టూ వార్తలు, ఊహాజనిత కథనాలు, రూమర్లు ఎన్నో పుడుతున్నాయి.
మొన్నటివరకు సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” సినిమాని ఆపేసి రణబీర్ కపూర్ తో “యానిమల్ 2” తీసేందుకు ముంబై వెళ్ళిపోయాడు అని ప్రచారం జరిగింది. కానీ అదంతా అబద్దమని నిర్మాత భూషణ్ కుమార్ ప్రకటించారు. “స్పిరిట్” పూర్తి చేసిన తర్వాత “యానిమల్ పార్క్” సందీప్ తీస్తాడని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఈ “స్పిరిట్”లో హీరోయిన్ గురించి రూమర్లు మొదలయ్యాయి.
ALSO READ: ‘స్పిరిట్’ని పక్కన పెట్టలేదు!
దీపిక పదుకోన్ పేరు వినిపిస్తోంది ఇప్పుడు. తన కూతురికి ఎనిమిది నెలలు నిండాయి. దాంతో ఇక మళ్ళీ నటించేందుకు ప్రయత్నిస్తోంది దీపిక పదుకోన్. బరువు కూడా తగ్గింది. త్వరలోనే షారుక్ ఖాన్ “కింగ్” చిత్రంలో చిన్న పాత్ర పోషించనుంది. ఆ తర్వాత చెయ్యాల్సిన సినిమాలపై ఆమె చర్చలు మొదలుపెట్టినట్లు టాక్.
ALSO READ: Deepika Padukone: I clean the kitchen
అందుకే, ముందే ఆమెని బుక్ చేసి డేట్స్ తీసుకుందామని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నట్లు టాక్ మొదలైంది. కానీ ఎందులో నిజమెంత అనేది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాకే అర్థం అవుతుంది.