
సమంత ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన వెబ్ సిరీస్ “సిటాడెల్ హానీ బన్నీ” నిరాశపరిచింది. ఈ వెబ్ సిరీస్ నాలుగు రోజుల క్రితం అమెజాన్ లో విడుదలైంది. ఈ సిరీస్ కి రివ్యూస్ నెగెటివ్ గా వచ్చాయి. అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
భారీగా ఖర్చు పెట్టి తీసిన ఈ వెబ్ సిరీస్ లో మేటర్ లేదు అని అందరూ అంటున్నారు. సమంత నటనకు పెద్దగా విమర్శలు రాలేదు కానీ మెచ్చుకోలు కూడా లేదు.
ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మొదట హాలీవుడ్ లో తీశారు “సిటాడెల్” సిరీస్ ని. 300 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి ఇండియన్ వెర్షన్ గా రూపొందించిన ఈ “సిటాడెల్ హానీ బన్నీ” కూడా తుస్సుమంది.
సమంతకి ఇది రెండో వెబ్ సిరీస్. మూడో వెబ్ సిరీస్ కూడా ఇదే దర్శకులతో చేస్తోంది. దాని పేరు… రక్త్ బ్రహ్మాండ్.