
ఇటీవల ప్రీమియర్ షోల క్రేజ్ ఎక్కువైంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ముఖ్యంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ అంటూ హడావిడి చేస్తూ హంగామా చేస్తున్నారు. కొన్ని సినిమాలకు ఇది కలిసొచ్చింది. కానీ ఇటీవల “హరి హర వీర మల్లు” వంటి సినిమాలకు ఇది నెగెటివ్ గా మారింది. “హరి హర వీర మల్లు”లోని గ్రాఫిక్స్ కి చాలా ట్రోలింగ్ జరిగింది. అది ప్రీమియర్ షోల నుంచే మొదలైంది.
అందుకే, ఇప్పుడు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు నిర్వహించే ట్రెండ్ కి కొంతకాలం బ్రేక్ పడేలా ఉంది.
విజయ్ దేవరకొండ నటించిన “కింగ్ డమ్” చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. జులై 30 రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించాలని ఇంతకుముందు భావించారు. ఐతే, “హరి హర వీర మల్లు” తర్వాత అలాంటి ఆలోచన వద్దని నిర్ణయానికి వచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈసారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
అసలే విజయ్ దేవరకొండకి నెగెటివ్ ట్రోలింగ్ బెడద ఎక్కువ. అతన్ని టార్గెట్ చేసి చాలామంది కొంతకాలంగా నెగెటివ్ చేస్తున్నారు. పైగా దేవరకొండకి సరైన హిట్ లేదు. అందుకే, ఈ సారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు.















