
తిరుపతిలో ‘కింగ్డమ్’ ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు నిరసన సెగ తగిలింది. కొంతమంది గిరిజనులు విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కింగ్డమ్’ను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు.
అసలు మేటర్ అందరికీ తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గిరిజనులకు కోపం తెప్పించాయి. గిరిజనుల్ని ఉగ్రవాదులతో పోల్చాడంటూ కొన్ని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దీనిపై కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పడ్డాయి. అటు విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ గిరిజనలు శాంతించలేదు. ఇప్పుడిలా తిరుపతిలో కూడా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇదే వేదికపై మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు విజయ్ దేవరకొండ. దేవుడి అండ, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే, ఈసారి చాలా పెద్దోడ్ని అవుతానని, టాప్ లో కూర్చుంటానని అన్నాడు. ‘కింగ్డమ్’ హిట్ తో తను నంబర్ వన్ స్టార్ అవుతానని పరోక్షంగా వెల్లడించినట్టయింది.















