
కమెడియన్ సుహాస్ తొందర్లో పేరు తెచ్చుకున్నాడు. తొందర్లో హీరోగా ఎదిగాడు. కానీ చాలామంది హీరోల్లాగే ఆ సక్సెస్ ని కొనసాగించలేకపోతున్నాడు. పెద్ద హీరోలకు వరుసగా నాలుగు ఐదు ఫ్లాపులు వచ్చినా పెద్దగా ఫరక్ పడదు. కానీ, సుహాస్ లాంటి వాళ్లకు అలా కుదరదు. రెండు, మూడు ఫ్లాపులు పడితే మొత్తం తేడా వస్తుంది.
ఇప్పుడు అదే జరిగింది. ఇప్పటికే వరుసగా నాలుగు ఫ్లాపులు చూసిన సుహాస్ కి ఇప్పుడు మరో ఘోరమైన అపజయం దక్కింది.
సుహాస్ నటించిన “ఓ భామ అయ్యో రామ” నిన్న విడుదలైంది. క్రిటిక్స్ అందరూ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. సినిమాకి కూడా నిల్ కలెక్షన్స్ వచ్చాయి. సుహాస్ సినిమాకి ఓపెనింగ్స్ రావడం అనేది మూడు సినిమాలకు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత అన్నీ ఫ్లాప్స్. దాంతో, ఈ సినిమాని పట్టించుకునేవారే లేకుండాపోయారు.
ALSO READ: Review of Oh Bhama Ayyo Rama
సుహాస్ ఇంతకుముందు నటించిన శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం, గొర్రె పురాణం, జనక ఐతే గనక పరాజయం పొందాయి. ఇది వరుసగా ఇదో ఫ్లాప్.















