
తమిళ హీరో జయం రవి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రవి వల్లే 100 కోట్ల రూపాయలు నష్టపోయాను అని రవి అత్తయ్య సుజాత విజయ్ కుమార్ తెలిపారు. తన కూతురు నుంచి విడాకుల కోసం అన్ని అబద్దాలు చెప్తున్నాడు అని ఆమె ఆరోపించారు.
అల్లుడి కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో తాను నిర్మాతగా మారాను అని ఆమె తెలిపారు. ఆయన కోసం నిర్మాతగా మారితే 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ అప్పు తీర్చేందుకు మళ్ళీ సినిమా చేస్తాను అని ప్రామిస్ చేసి మాట తప్పాడని ఆమె చెప్పారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఎన్నో కష్టాలు పడ్డామని ఆమె అంటున్నారు.
కానీ జనం నుంచి సానుభూతి కోసం తాను హీరోని అన్న విషయం మరిచిపోయి అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అని రవి అత్తగారు చెప్పారు.
రవి తన భార్యకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. విడాకుల కేసు తేలకముందే ప్రియురాలు కెన్సెస్ తో కలిసి ఇటీవల ఒక ఫంక్షన్ కి హాజరయ్యాడు.