ఇంటర్వ్యూలు

చూడ్డానికి హారర్, చేయడానికి కల్కి!

Published by

షార్ట్ గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది శ్రద్ధా శ్రీనాధ్. విశ్వక్ సేన్ సరసన ఆమె నటించిన మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన శ్రద్ధ.. కొత్తకొత్తవి అనుభూతి చెందడం తనకు ఇష్టమని చెబుతోంది.

మెకానిక్ రాకీ కథలో మీకు నచ్చిన ఎలిమెంట్స్?

నేను ఒక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. ప్రతి రెండేళ్ళకోసారి రాష్ట్రం మారుతుంటాం. అలా కొత్తకొత్తవి అనుభూతి చెందడం అలవాటైంది. ‘మెకానిక్ రాకీ’లో నాది అలాంటి కొత్త పాత్ర. ఇప్పటివరకూ చేయని రోల్ ఇది. నాకు చాలా ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేశాను. మాయ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.

మరో హీరోయిన్ మీనాక్షితో కాంబినేషన్..?

సినిమాలో మాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేవు కానీ సెట్స్ లో చాలా సార్లు కలిశాం. తనది కూడా ఆర్మీ కుటుంబమే. మా ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయి.

మీ తొమ్మిదేళ్ళ సినిమా జర్నీ గురించి?

నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేరు. ప్రతి సినిమా ఒక లెసన్. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. జెర్సీ తర్వాత పీక్స్ చూశాను. కోవిడ్ లో సినిమాలు ఆగినప్పుడు అందరిలానే నేనూ భయపడ్డాను. హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు క్యాలిటీ వర్క్స్ ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్ గా వెళ్తున్నాను.

ఇష్టమైన జోనర్?

చూడటాని హారర్ జోనర్ ఇష్టం. చేయడానికి మాత్రం ‘కల్కి’ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలంటే ఇష్టం. అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని ఉంటుంది. అలాగే కామెడీ సినిమాల్లో కూడా చేయాలని ఉంది.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్?

“డాకు మహారాజ్” సంక్రాంతికి వస్తోంది. తమిళ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. విష్ణు విశాల్ తో ఓ సినిమా ఉంది. 

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025