మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అయింది.
ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ స్పందించారు. శివుడు-పార్వతి వెకిలిగా ఉంటే సినిమా ఎవడు చూస్తాడని ప్రశ్నించారు తమ్మారెడ్డి.
“ఇప్పటికే కన్నప్పపై కొన్ని సినిమాలొచ్చాయి. అన్నీ బాగా ఆడాయి. కన్నప్ప మాత్రం ఆడలేదు. ఎందుకంటే, ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఈసారి నిలబడలేదు. ఇక్కడ శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి విష్ణు, మోహన్ బాబుకు చెప్పాను. భక్తి లేకుండా భక్త కన్నప్ప తీశారని చెప్పాను. శివుడే సరిగ్గా లేకపోతే భక్తి ఎక్కడ్నుంచి వస్తుంది. అనామకుడ్ని పెట్టినా బాగుండేది. శివుడు, పార్వతి పాత్రల కోసం పెట్టిన డబ్బులన్నీ బొక్క.”
ఇలా ఉన్నదున్నట్టు ఓపెన్ గా మాట్లాడేశారు తమ్మారెడ్డి. తను ఇలా ఓపెన్ గా మాట్లాడ్డానికి ఓ కారణం కూడా ఉందంటున్నారాయన.
“ఇది తప్పు అని నేను చెప్పకపోతే ఇండస్ట్రీకి నష్టం. రేపు మరొకరు మరో ఫ్లాప్ కన్నప్ప తీస్తారు.” అనేది ఆయన వెర్షన్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More
"మున్నీటి గీతలు" పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి… Read More