అవీ ఇవీ

నయన్ నడుము ఓ మెక్సికన్ వేవ్!

Published by

‘మెక్సికన్ వేవ్’ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. క్రికెట్ లేదా ఫుట్ బాల్ స్టేడియంలో క్రమబద్ధంగా ప్రేక్షకులు లేచి గోల చేయడం. లాంగ్ షాట్ లో చూస్తే, ఇదంతా ఓ పెద్ద అలలా కనిపిస్తుంది. దానికి ముద్దుగా ‘మెక్సికన్ వేవ్’ అని పేరుపెట్టారు.

కెరీర్ ప్రారంభంలో నయనతార నడుమును మెక్సికన్ వేవ్ తో పోలుస్తూ కామెంట్స్ చేశారు చాలామంది. ఆమె నడుము అంత పెద్దగా ఉందనేది దానర్థం. అప్పట్లో ఆమె కాస్త లావుగా ఉండేది మరి.

దీనిపై నయనతార స్పందించింది. ఏ హీరోయిన్ కు ఎదురుకాని విధంగా, కెరీర్ ప్రారంభంలోనే తను బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నానని వెల్లడించింది.

“గజనీ సినిమా పెద్ద హిట్. కానీ అదే నాకు పెద్ద దెబ్బ. ఆ సినిమాలో నా గురించి వచ్చిన కామెంట్స్ అన్నీఇన్నీ కావు.  బాగా లావుగా ఉంది, అసలెందుకు తీసుకున్నారనే విమర్శలొచ్చాయి. నా జీవితంలో తొలి బాడీ షేమింగ్ అదే. అప్పట్లో నాకు ఎవ్వరూ అండగా లేరు. మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవ్వరూ మనకు అండగా నిలబడరు. ఇట్స్ ఓకే అని చెప్పే మనిషి కూడా నా చుట్టుపక్కల్లేరు. ఆ క్షణం నుంచే నేను స్ట్రాంగ్ గా తయారవుతూ వచ్చాను. ఎందుకంటే, నాకు వేరే ఆప్షన్ లేదు.”

ఇలా కెరీర్ లో తన తొలి బాడీషేమింగ్ అనుభవాన్ని బయటపెట్టింది నయనతార. 

Recent Posts

శృతిహాసన్ ఇక కనిపించదు

హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More

July 9, 2025

డ్రగ్స్ కేసులో హీరోకు బెయిల్

మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More

July 9, 2025

ఈ సినిమాలో కియరా ఉందంట

కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More

July 9, 2025

బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More

July 8, 2025

అందుకే అనుపమకి కష్టాలు!

అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More

July 8, 2025

2025: మలి సగం మెరవాల్సిందే!

6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More

July 7, 2025