ప్రేమ ఏదీ కోరుకోదు, ప్రేమకు ఎల్లలు లేవు, ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, అజరామరం ప్రేమ, ప్రేమ ఏదీ ఆశించదు.. ఇలా చాలా కొటేషన్లు చిన్నప్పట్నుంచి వింటున్నాం. తన దృష్టిలో ప్రేమ అంటే ఇదేదీ కాదంటున్నాడు విజయ్ దేవరకొండ. అన్ కండిషనల్ లవ్ అనేది పచ్చి అబద్ధమని, ప్రేమలో ఆశించడం తప్పు కాదని అంటున్నాడు.
“ప్రేమించడం అంటే ఏంటో నాకు తెలుసు. ప్రేమను పొందితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. కానీ అన్-కండిషనల్ లవ్ (షరతుల్లేని ప్రేమ) అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే నేను కొన్ని అంచనాలతో ప్రేమిస్తాను. లవ్ లో నాకంటూ కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఏదీ ఆశించకుండా ప్రేమించడం నావల్ల కాదు.”
ఇలా ప్రేమకు తనదైన నిర్వచనం ఇచ్చాడు ఈ హీరో. గతంలో తను ఓ నటితో ప్రేమాయణం సాగించానంటున్నాడు. కెరీర్ కు పెళ్లికి సంబంధం లేదని తను చెప్పొచ్చని, కానీ ఓ మహిళా నటికి కెరీర్ మధ్యలో పెళ్లి అనేది కాస్త కష్టమైన విషయం అంటున్నాడు.
డేటింగ్ పై కూడా తనకు సదభిప్రాయం లేదని తెలిపాడు విజయ్ దేవరకొండ. చాన్నాళ్లుగా పరిచయం ఉండి, స్నేహం ఏర్పడిన తర్వాత డేటింగ్ కు వెళ్లడాన్ని తాను ఇష్టపడతానని తెలిపాడు. విజయ్ దేవరకొండ ఇచ్చిన ప్రతి స్టేట్ మెంట్ ను రష్మికకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More