న్యూస్

రాజకీయాలకు పోసాని గుడ్ బై

Published by

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పదేళ్లపాటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న ఆయన ఇక ఏ పార్టీలో లేను అంటూ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తమ పార్టీపై, నేతలపై అసభ్యకరంగా మాట్లాడిన / అబద్దాలు ప్రచారం చేసిన పోసాని, రామ్ గోపాల్ వర్మలపై కేసుల పరంపర మొదలైంది.

దాంతో, పోసాని ఇక కుటుంబం కోసం అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…

  • ఇక నుంచి నేను రాజకీయాలను మాట్లాడను
  • ఏ పార్టీని పొగడను… మాట్లాడను… విమర్శించను…
  • ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.
  • రెండ్రోజుల క్రితం నా చిన్న కొడుకు అడిగాడు…. పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ అంటావు, మరి ఫ్యామిలీ ఏంటని అడిగాడు. అందుకే నా కుటుంబం కోసం…. నా పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా.
  • నేను ఓ పార్టీని తిట్టాలని పొగడాలని రాజకీయాల్లోకి రాలేదు..ఓటర్ లాగే ప్రశ్నించాను.. ఎవరు కేసులు పెట్టినా, దాడులు చేసినా నేను భయపడను. ఇక నుంచి నా బిడ్డలు, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను.

Recent Posts

రూ.6 కోట్లు చేజారిపోతాయా?

తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More

May 23, 2025

కనకమేడల అసందర్భ ప్రకటన

చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More

May 23, 2025

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More

May 23, 2025

బన్నీకి ఈ భామలు ఫిక్స్!

అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More

May 23, 2025

వీళ్లకు అంత సీనుందా?

కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More

May 23, 2025

సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ

సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More

May 22, 2025