అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” ఇంతవరకు విడుదల కావడం లేదు. ఈ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకొంది.
అనుపమ పరమేశ్వరన్ సినిమాకి సెన్సార్ రావడానికి కారణం ఆ టైటిల్ లో జానకి అనే పేరు ఉండడమే. ఒక లీగల్ కేసు నేపథ్యంగా తీసిన సినిమాకి సీతాదేవి పేరు పెట్టడం వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న వచ్చింది. దాంతో, సెన్సార్ బోర్డు ఇంతవరకు సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేదు.
ఇటీవల మోహన్ లాల్ హీరోగా రూపొందిన “ఎల్ 2 ఎంపురాన్” సినిమాలోని కొన్ని సన్నివేశాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. హిందూ మతం, బీజేపీకి వ్యతిరేకంగా అవి ఉన్నాయి అని విమర్శ రావడంతో, నిర్మాతలు తమంతట తామే ఆ సన్నివేశాలను తొలగించారు. అప్పటి నుంచి, కేరళలోని సెన్సార్ బోర్డు ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
అందుకే,అనుపమ చిత్రం సమస్యలు ఎదుర్కొంటోంది. మోహన్ లాల్ మూవీ వల్లే ఇలా జరుగుతోందని మలయాళ నిర్మాతలు అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More