6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాత ‘కుబేర’, ‘తండేల్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘కోర్టు’, ‘సింగిల్’ లాంటి ఓ అరడజను సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి మలి సగం సంగతేంటి?
రాబోయే 6 నెలలు పరిశ్రమకు కీలకంగా మారాయి. తొలి సగంలో కనిపించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి విజయాలు కనీసం ఓ 2 అయినా పడాలి. థియేట్రికల్ వ్యవస్థ నిలబడాలన్నా, డిస్ట్రిబ్యూటర్లు నిలదొక్కుకోవాలన్నా ఈ 6 నెలలు చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి సినిమాలున్నాయా?
ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలొస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ మార్కెట్లో నిలబడి, ఇండస్ట్రీని నిలబెట్టే సినిమా కావాలి. మిగిలిన ఈ 6 నెలల్లో భారీ అంచనాలతో వస్తున్న అలాంటి సినిమా ‘హరిహర వీరమల్లు’. సినిమా క్లిక్ అయిందంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం. పవన్ స్టామినా అది.
ఇక్కడితో అయిపోలేదు. మలి సగంలో పవన్ నటించిన ‘ఓజీ’ సినిమా కూడా ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అనుకున్న తేదీకి వచ్చి క్లిక్ అయితే మాత్రం టాలీవుడ్ స్లంప్ నుంచి బయటపడినట్టే.
ఇక లిస్ట్ లో ‘రాజాసాబ్,’ ‘అఖండ-2’ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండూ ఈ ఏడాదిలోనే వస్తున్నాయి. ఇవి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.
జాబితాలో ‘ఘాటీ’, ‘మాస్ జాతర’ సినిమాలున్నప్పటికీ పైన మనం చెప్పుకున్న సినిమాల స్థాయిలో ప్రభావం చూపించేవి కావివి. ఇవి కాకుండా, సాయి ధరమ్ తేజ “సంబరాల ఏటి గట్టు”, అడవి శేష్ “డెకాయిట్” ఉన్నాయి. ఇలా రాబోయే 6 నెలల్లో దాదాపు 5 పెద్ద సినిమాలున్నాయి. వీటిలో కనీసం 3 బ్లాక్ బస్టర్ హిట్టయినా టాలీవుడ్ కు గోల్డెన్ పీరియడ్ మొదలైనట్టే.
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More