మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా నిలిచారు. 1980 చివర్లో, 1990లలో వీరే టాప్ హీరోస్. ఒకరికొకరు పోటీ పడేవారు తమ చిత్రాలతో. ఐతే, ఇప్పుడు అందరూ జీవితంలో తాతలు అయ్యారు, కెరీర్ లో సీనియర్ సిటిజెన్ స్టార్స్ గా మారారు. అందుకే ఇప్పుడు ఒకరితో కలిసి ఒకరు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
త్వరలోనే వెంకటేష్ నాలుగు సినిమాల్లో నటిస్తారు. అందులో రెండు చిత్రాలు చిరంజీవి, బాలయ్యలతో.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా డైరెక్ట్ చేస్తుండగా, ఆ సినిమాలో వెంకటేష్ కి ఒక కీలక పాత్ర ఉంది. చిరంజీవితో ఉన్న స్నేహం, అనిల్ రావిపూడితో ఉన్న అనుబంధం కారణంగా వెంకటేష్ ఇందులో దర్శనమివ్వబోతున్నారు. ఇక బాలయ్యతో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నట్లు తెలిపారు వెంకటేష్.
నాగార్జున మినహా మిగతా ఇద్దరితో వెంకీ సినిమాలు చేస్తున్నారు. నాగార్జునతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ ముచ్చటా తీరుతుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More