శేఖర్ కమ్ముల తీసిన “కుబేర” చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు.
కుబేర ఒప్పుకోవడానికి కారణం?
మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. కథలో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు.
నేను ఇందులో సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.
శేఖర్ మీ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేశారా ?
ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది. ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్… అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉంటాయి. ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు. రష్మిక పాత్ర చాలా హైలెట్ గా ఉంటుంది. ఇందులో ఈ పాత్ర కూడా హీరో పాత్ర అన్నట్లుగా ఉండదు. పాత్రలే కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.
మీ వందో చిత్రం గురించి చెప్పండి?
100వ చిత్రం ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’ అని పెట్టారు.
శివ 4k పనులు ఎంతవరకు వచ్చాయి?
శివ 4కె ఫినిష్ అయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతుంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.
కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
కూలీలో డిఫరెంట్ కరెక్ట్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More