న్యూస్

రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

Published by

‘మీర్జాపూర్‌’ సిరీస్‌ తో నటుడు దివ్యేందు శర్మ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నటుడు ఇప్పుడు తెలుగులో నటిస్తున్నాడు. అతని మొదటి తెలుగు చిత్రం.. పెద్ది. రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం… పెద్ది.

ఈ రోజు దివ్యేందు శర్మ పుట్టిన రోజు. అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ‘రామ్‌ బుజ్జి’ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు దివ్యేందు శర్మ. ఈ పోస్టర్లో క్రికెట్ బంతిని ఎగరేస్తూ కనిపించాడు దివ్యేందు శర్మ.

ఇంతకుముందు రామ్ చరణ్ మొదటి లుక్ వీడియో, ఇప్పుడు దివ్యేందు పోస్టర్ ని బట్టి చూస్తే “పెద్ది” ప్రధానంగా క్రికెట్ చుట్టూ తిరిగే కథ అనిపిస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

“పెద్ది”ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చెయ్యనున్నారు.

Recent Posts

సుప్రీం తీర్పు: లాభం కొంతే

'థగ్ లైఫ్' సినిమాకి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. కమల్ హాసన్ ని సమర్ధించింది.… Read More

June 19, 2025

కుబేరాకి కలిసొచ్చిన హాలిడే

'కుబేరా' సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగా లేవు అనిపించాయి. కానీ చివరి నిమిషంలో బాగా పెరిగాయి. మరికొద్దీ గంటల్లో అమెరికాలో ఈ… Read More

June 19, 2025

కుబేర చెయ్యడానికి గట్స్ కావాలి

శేఖర్ కమ్ముల తీసిన "కుబేర" చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన… Read More

June 19, 2025

కీరవాణిని సైడ్ చేసిన భీమ్స్!

ఎం.ఎం. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు. ఏకంగా ఆస్కార్ కూడా అందుకున్నారు. ఆస్కార్ అందుకొన్న మొదటి తెలుగు వాడు ఆయన.… Read More

June 18, 2025

నా బాడీ నా ఇష్టం: శృతి

శృతి హాసన్ ఏ విషయం దాచుకోదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్నీ ఆమె… Read More

June 18, 2025

చిరుతో జాయిన్ అయిన నయనతార

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిరంజీవి… Read More

June 17, 2025