ఇంటర్వ్యూలు

రాజామౌళితో గొడవ లేదు, గ్యాప్ లేదు!

Published by

కె.కె. సెంథిల్ కుమార్ అనగానే రాజమౌళితో ఆయన చేసిన సినిమాలే గుర్తొస్తాయి. ఛత్రపతి, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ వంటి కళ్ళు చెదిరే సినిమాలకు అద్భుతమైన కెమెరా అందించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ఐతే, ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న సినిమాకి మాత్రం సెంథిల్ పని చెయ్యడం లేదు. దాని బదులు, అయన గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన మొదటి చిత్రం “జూనియర్”కి కెమెరా అందించారు. ఐతే, రాజమౌళితో తనకు ఎలాంటి గొడవా లేదు, తమ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని క్లారిటీ ఇస్తున్నారు సెంథిల్. జూలై 18న “జూనియర్” రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో ముచ్చటించారు.

రాజమౌళి సినిమా వదులుకొని “జూనియర్” సినిమా చెయ్యడానికి కారణం ఏంటి?

“ఆర్ ఆర్ ఆర్” పూర్తి కాగానే ఇది ఒప్పుకున్నాను. నిర్మాత సాయి గారితో ‘ఈగ’ సినిమా నుంచి అనుబంధం ఉంది. డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ సినిమా అంగీకరించాను. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. కిరీటి చాలా హార్డ్ వర్కర్. చాలా అద్భుతమైన డాన్సర్.

అంతే కాదు, రాజమౌళి తో హెవీ గ్రాఫిక్స్ సిజీ వర్క్ ఉన్న సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి సినిమా చేయడం రిఫ్రెష్ గా అనిపించి చేశాను. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్ నాకు చాలా నచ్చింది.

మీరు ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమి చూస్తారు?

కథలో ఎమోషన్ మన హృదయాలను టచ్ చేస్తుందా లేదా అనేది చూస్తాను. ఎమోషన్ మనల్ని కదిలించకపోతే మిగతా ఎలాంటి హంగులు పెట్టినా వ్యర్థం.

మీకు రాజమౌళితో గొడవలు ఉన్నాయా? ఈ గ్యాప్ కి నిజమైన కారణం ఏంటి?

నేను గతంలో కూడా రాజమౌళి గారితో గ్యాప్ తీసుకున్నాను. ఛత్రపతి తర్వాత ‘విక్రమార్కుడు’ నేను చెయ్యలేదు. మగధీర తర్వాత ‘మర్యాద రామన్న’కి వేరే కెమెరామన్ పనిచేశారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి పని చెయ్యకపోవడం అనేది షాకింగ్ కాదు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తాం.

మీరు డైరెక్టర్ కాబోతున్నారా?

ఆ ఆలోచన అయితే ఉంది. అదే అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని కథల మీద పని జరుగుతోంది. నేను సినిమాటోగ్రాఫర్ గా మారి పాతికేళ్ళు అయింది. బాహుబలి, ఆర్ఆఆర్ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టం. మంచి సినిమాలకు వర్క్ చేశాను అనే సంతృప్తి ఉంది.

కొత్త సినిమాలేంటి?

నిఖిల్ హీరోగా “స్వయంభు” అనే సినిమా జరుగుతోంది. “ఇండియన్ హౌస్” అనే సినిమా కూడా ఒప్పుకున్నాను.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025